top of page
Search
Writer's picturekkanigvrdn reddy

సోమిరెడ్డి గారి అవినీతి చిట్టా మరియు అసమర్ధ నాయకత్వం గురించి సవివరంగా

👉 ప్రతి రోజు ప్రజల పక్షం నిలబడి వాళ్ళ సమస్యలను తన సమస్యగా భావించి పోరాడుతున్న నాయకుడు కాకాణి గారు,ఆయన నాయకత్వాన్ని మెచ్చి వై.యస్.ఆర్ కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ప్రారంభం ఐయ్యి,ఉదృతంగా చేరికలు జరుగుతున్నాయి.


👉తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేసినటువట్టి వాళ్ళు,ఈరోజు సోమిరెడ్డితో ఇమడలేక,చీదరించుకొని బయటకు వచ్చే పరిస్థితి.


👉ఎవరైనా సోమిరెడ్డి దగ్గరికి పనికి వెళ్తే,వాళ్ళకి కండువాలు కప్పడం... వాళ్ళు 24గంటలు గడవక ముందే ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి అయ్యా మేము పని కోసం వెళ్తే ఆయన కండువాలు కప్పాడు అని వాపోయిన సందర్భాలు చాలా చూశాం.అలానే ఎంతో మంది సర్పంచులు, ఎంపీటీసీలు తిరిగి రావడం జరిగింది.


👉తన పార్టీ వాళ్లకే కండువాలు కప్పుకొని చంకలు గుద్దుకుంటూ వచ్చాడు.కానీ వాస్తవ పరిస్థితులు అనుకూలంగా లేవని రాబోవు రోజుల్లో వై యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం..తాను ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వస్తుంది అని అర్ధం కావడంతో.మతి భ్రమించి వివిధ వ్యాఖ్యలు చేస్తున్నాడు.కాబట్టి మనం కూడా చంద్రమోహన్ రెడ్డి తన బాధని వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టలేం.


👉ఎమ్మెల్యే గారు కోర్టులకి వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని మంత్రి గారు అంటున్నారు.అయ్యా కోర్టులు ఉండేది అభివృద్ధిని అడ్డుకోడానికా??లేక అవినీతిని అడ్డుకోడానికా??


👉జిల్లా చరిత్రలో రైతుల పెరు చెప్పి దోచుకున్న వ్యక్తి మీరు.40ఏళ్ల మీ రాజకీయ జీవితం అంతా అవినీతి, అక్రమాలు,ఆశ్రీతపక్షపాతం, అధికారులను బెదిరించడం తప్ప,సరైన నాయకత్వం ఇచ్చింది లేదు.


👉మీరు నిత్యం అవినీతికి పాల్పడుతూ, అభివృద్ధిని జపం చేసినట్టు నటిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి..ఎలా ఐనా మీ చివర ఎన్నికల్లో గెలవాలి అని ప్రయత్నంలో ఉన్నారు.


👉 ప్రజల పక్షాన పోరాటం చేయడం కానీ కానీ,కార్యకర్తలకు అండగా ఉండటం కానీ.అలా ప్రజలకోసం విస్తృతంగా పని చేశాడు కాబట్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గోవర్ధనరెడ్డి లాంటి వ్యక్తి మాకు అండగా ఉన్నాడు అని గుండెల మీద దైర్యంగా చెయ్యివేసుకునే పరిస్థితి,మరోపక్క టీడీపీ నాయకులు ఏమో సోమిరెడ్డి ముందు కార్లో ఉంటే,వాళ్ళు వెనక కార్లో కూర్చొని ఇది గెలిచే కేసు కాదు అని సంభాషించుకొనే దుస్థితి.


👉మొత్తానికి తండ్రి హోల్ సేల్ వ్యాపారం,కొడుకు రిటైల్ వ్యాపారం చేస్తున్నారు.ఒక సమేత ఉంది ఆవు చేలో మేస్తే,దూడ గట్టున మేస్తుందా అనే చందంగా తయారు ఐయ్యింది తండ్రీ కొడుకుల పరిస్థితి.


*సోమిరెడ్డి గారి అవినీతి గాధల్లో మచ్చుక్కి కొన్ని*


👉 నీరు-చెట్టు పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నాడు


👉కాకాణి గారు రైతు రథం పథకం కన్నా ఒక్కో ట్రాక్టర్ మీద లక్ష రూపాయలు మినహాయింపు ఇప్పిస్తాం అని పలు మార్లు చెప్పారు. రైతు రథం పథకంలో అధికంగా ఉన్న లక్ష రూపాయలు,ఎవరి జేబుల్లోకి వెళ్తుంది??


👉కనుపూర్ కాలువ పనుల్లో,పనులు చేయకుండా దొంగ బిల్లులు చేసుకోడానికి ప్రయత్నం చేయడం మీ అవినీతికి తార్కాణం కాదా??


👉కండలేరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ లో...సోమిరెడ్డి అవినీతి కారణంగా. ఒకటి కంపెనీ మోటార్ బిగించి,ఇంకోకటి అసెంబుల్ మోటార్ బిగించడంతో అది వారం రోజులకు ఆగిపోయింది.


👉బండేపల్లి-డేగపూడి కాలువ పనులు కూడా నామినేషన్ పద్ధతిలో తనకు నచ్చినవాళ్లకు ఇప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు.కాలువ పూర్తి చేయకపోతే 2019లో ఓట్లు అడగను అనిన వ్యక్తి,ఇంకా భూసేకరణ కూడా పూర్తి చేయలేదు.ఎందుకంటే ఆయనకి కాంట్రాక్ట్ మీద ఉన్న శ్రద్ధ బండేపల్లి రైతాంగం మీద లేదు కనుక.


👉 రామదాసు కండ్రిగలో పేదల భూములకు సంబంధించి...దొంగ పట్టాల మీద సాక్షాత్తు మంత్రి సంతకం పెట్టి ,నష్ట పరిహారం చెలింపులు చేయమనడంలో మీ పాత్ర ఏంటి??ఒకవేళ మీ తప్పు లేకపోతే, పోలీసు విచారణ ఎందుకు జరిపించలేదు??


👉అనికేపల్లి పంచాయతీలో,రూ-అర్బన్ పథకం కింద 5 కోట్ల రూపాయల పనుల్లో...ఫోర్జరి సంతకాలు పెట్టి,దొంగ తీర్మానాలు చేశారు. దాని మీద కలెక్టర్ విచారణ జరిపి సర్పంచ్ పాత్రని నిర్ధారిస్తే....మంత్రి గారు కలెక్టర్ ని విమర్శిస్తూ సర్పంచ్ ని వెనకేసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, ఆ పనుల్లో మీ కుమారుడికి 70 లక్షల రూపాయల డీల్ కుదిరి,50 లక్షల రూపాయల ముట్టింది కాబట్టి.


👉సిల్లికా మైనింగ్ లో...దాదాపు 2200 ఎకరాల అటవిభూమిని కాజేయడానికి పావులు కదిపారు.


👉నేను పోరాట యోధుడను,థర్మల్ ప్రోజెక్టు రనివ్వను అని చెప్పుకొని తిరిగి,మరి ఈరోజు అదే పోరాట యోధుడు యష్ పాండ్ కాంట్రాక్టును 5కోట్ల కమిషన్ కు అమ్ముకున్నాడు.


👉పాపం రైతులు ఆరుగాలం పాటు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించకుండా,మిల్లర్ల దగ్గర 50కోట్ల రూపాయల ముడుపులు మింగి రైతుల నడ్డి విరిచాడు.


👉మీ అవినీతికి ఈ నియోజకవర్గం చాలదు అన్నట్టు.. పక్క నియోజకవర్గాల్లో కూడా మీ అవినీతి జెండా పాతారు...పసుపులో మట్టి కలిపించి, కొనుగోలలో కుంభకోణానికి తెరలేపారు.సంపాదన ఏమో సోమిరెడ్డికి,ఉద్యోగాలు పోగొట్టుకొని నష్టపోయిందేమో చిరు ఉద్యోగులు.


👉ఇడిమేపల్లిలో మంత్రి అవినీతి పతాక స్థాయికి చేరింది.స్వయంగా మంత్రే తప్పుడు పత్రాలతో వేరే వాళ్ళ భూమిని,బీర్ ఫ్యాక్టరీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు.ఆ భూమి యజమానులు కోర్ట్ కి వెళ్తే..మీరు మూడో ముద్దాయిగా న్యాయస్థానంలో నిలబడాల్సిన పరిస్థితి.


👉చివరికి మీరు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారు.మీ సొంత శేఖలో పదోన్నతులకి కూడా డబ్బులు తీసుకున్నారు.


👉వీటన్నింటి దృష్ట్యా సర్వేపల్లి ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలే సోమిరెడ్డిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు.



46 views0 comments

Comments


bottom of page