top of page
Search
Writer's picturekkanigvrdn reddy

యాష్ పాండ్యన్ అవినీతి లో మరో కల్కితురాయి

👉యమయ్యో సోమి

రెడ్డి...నీకున్న యాష్ పాండ్యన్ అనే ... నామాన్ని సార్ధకం చేసుకోవడానికి,నువ్వు పడుతున్న కష్టం, చేస్తున్న అరాచకాలు చూస్తావుంటే దినెమ్మాబడవా ముచ్చటేస్తుందనుకో.... అవినీతిలో ఆకాశానికి నిచ్చెన వేస్తున్న నీ ఆరాటం, లంచాలు మింగేదానికి నువ్వు అవలంబిస్తున్న విధానాలు చూస్తావుంటే సర్వేపల్లోళ్ళ మొఖాన నెత్తురు చుక్క ఉండటంలా...ఇట్టాంటోడు మనకు మంత్రి ఎట్టా అయ్యాడా అని...


👉 యాష్ పాండుతో నేలటూరోళ్లని నేలమట్టం చేసేదాక ఊరుకునేల లేవుగా నువ్వు??? నీ అవినీతి,అరాచకం పుణ్యనా నేలటూర్లో కన్నీళ్లు పెట్టుకోనోడంటు ఒక్కడూ లేడు... బూడిద గుంతలు వద్దన్నోడే నేడు అవే బూడిద గుంటలతో తమ జీవితాల్ని బూడిదపాలు జేస్తా ఉంటే బోరుమంటా ఉన్నారు ఆ ఊళ్ళో... ఈమధ్య కాలంలో నీ అరాచకాలు జిల్లాని దాటి రాష్ట్ర స్థాయిలో కూడా జనాల నోళ్ళలో నాంతా ఉన్నాయి, పేపరోళ్ళు అయితే నీ యవ్వరాలని మెయిన్ ఎడిషన్లో మొదటి పేజీలో నూకతా ఉన్నారు.. ఎంత ఎదిగిపోయావ్ సోమిరెడ్డి. నీదుంపతేగా అసాధ్యుడివి సామి నువ్వు.. నీ అవినీతి చరిత రేపు టీడీపీ భావి నాయకులకి ఓ దిక్సుచి అవ్వుద్ది చూస్తా ఉండు...


👉సరే ఇదంతా ఒకెత్తు గాని... నువ్వు అప్రతిష్టాత్మకంగా చేపట్టిన యష్ పాండ్ల గోడలు అప్పుడే నెర్లిచ్చయంట ఏంది మందల???.. ఓపినింగ్ కూడ కాకుండానే గోడలు పగలనూక్కున్నాయి అంటే నాణ్యత ప్రమాణాలు ఏమాయన పాటించి ఉంటారో ఓ తూరి ఆలోచించు.. అయినా కట్టడానికి కేటాయించిన డబ్బుల్లో సగం నువ్వు నొక్కే దానికే సరిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు... అందుకే సిమెంట్ తో కట్టాల్సిన గోడలు బూడిద ఏసి కట్టింటారు అందుకే అవి అప్పుడే పగుళ్లిస్తా ఉన్నాయి... పని చేస్తే పదికాలలపాటు నిలిచేలా చెయ్యాలా.. అంతే గాని నువ్వు కూడా నీ నాయకుడు మాదిరే అన్ని తాత్కాలికంగా చేస్తే ఎట్టా సోమిరెడ్డి?? జనాలు అసహ్యించుకోరా?? ఇలాంటి పనులు చేస్తే...


👉అయినా పర్యావరణం నుండి పూర్తి అనుమతులు కూడా రాకుండానే ఆదరాభాదరా గుంతలనిర్మాణ కాంట్రాక్టుని ఎలాంటి టెండర్లు లేకుండానే నామినేషన్ పద్దతిలో నీకు నచ్చినోడికి పర్సెంటేజ్ మాట్లాడుకుని టోకుగా ఇచ్చేసి చేతులు దులుపుకుంటువి.. నీ డబ్బులు నీ జేబుకు చేరినివా లేదా చూసుకున్నావ్ తప్ప ఆ పాండ్లు సరిగా కడుతున్నారా లేదా దానికి సంబంధించిన అనుమతులు వస్తున్నాయా లేదా చూసుకో బల్యా?? ... మీరు చేసే పనులవలన జనాలు నాశనం తప్ప ఏదన్నా ఉపయోగం ఉందా సోమిరెడ్డి...??

51 views0 comments

Comments


bottom of page